రైతులు ధాన్యంను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్వినీ రెడ్డి సూచించారు. పాలకుర్తి మండలంలోని, లక్ష్మీనారాయణపురం గ్రామం ఐకేపీ, ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఎమ్మెల్యే హనుమాండ్ల యశస్వినీ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రతి రైతుకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 174








