కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సోమవారం కౌన్సిల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చేయాల్సిన పని ముఖ్యమంత్రి చేయాలన్నారు. మీనాక్షి నటరాజన్ రివ్యూ చేయాలంటే గాంధీ భవన్ లో చేయాలన్నారు. సీఎంకు, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జికి మధ్య గ్యాప్ ఏంటో వారు తేల్చుకోవాలన్నారు. వారి మధ్య గొడవేంటో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టిపెట్టాలన్నారు. ఇన్ఛార్జి ఏం చేస్తుంది? సీఎం ఏం చేస్తున్నారు? ఎవరేం చేస్తున్నారు? అనేది పార్టీ చూడాలన్నారు. సీఎంను మారుస్తారా? హుస్సేన్ సాగర్ లో దూకుతారా? అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టమన్నారు. మీనాక్షి నటరాజన్ తీరు సరికాదన్నారు. ఆమె పరిధి ఏంటనేది తెలుసుకోవాలని సూచించారు. పార్టీ అంతర్గత విషయాలపై ఆరా తీయాలనుకుంటే ఇంటెలిజెన్స్ వివరాలు తీసుకోవాలన్నారు.








