దేశ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఎలక్ట్రానిక్ నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. సోమవారం కశ్మీర్లో పర్యటించారు. కథువా జిల్లాలోని హీరా నగర్ సెక్టార్లో ఉన్న ఔట్ పోస్ట్ ‘వినయ్’ను సందర్శించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి అధునాతన సాంకేతికత ఎంతో కీలకంగా ఉంటుందని వెల్లడించారు.
Post Views: 121








