ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రమాదంపై పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. ‘నా కొడుకు సమ్మర్ క్యాంప్ కోసం వెళ్లాడు. అక్కడ చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఊపరి తిత్తుల్లో కొంత సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రతి తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. ప్రమాదంలో ఓ పాప చనిపోయింది. అది నన్ను కలిచివేసింది. అరకు పర్యటన వల్ల నేను ఉదయమే వెళ్లలేకపోయాను. ప్రమాదం జరిగిన ప్రాంతానికి నా భార్య, పిల్లలు ఉన్న ప్రాంతం నుంచి 10 నిముషాల్లో చేరుకోవచ్చు. నా భార్యతో మాట్లాడాను. ఆమె డిప్రెషన్ లో ఉంది. ఏమీ చెప్పలేకపోతోంది. భగవంతుడి దయ వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు. నేను వెళ్లి చూసిన తర్వాత నాకు పూర్తి క్లారిటీ వస్తుంది’ అంటూ చెప్పారు.
వారందరికీ స్పెషల్ థాంక్స్..
నా కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అంటు పవన్ కళ్యాణ్ తెలిపారు., అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు కూడా ఫోన్ చేసి భరోసాను ఇచ్చారన్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నా కుమారుడు త్వరగా కోలుకోవాలంటూ కోరారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరగా కోలుకోవాలంటూ విషేస్ చెప్పారన్నారు. ఈ సమయంలో తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పి అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పవన్ పేర్కొన్నారు. మా అన్నయ్యలు చిరంజీవి, నాగబాబుతో పాటు నా కుటుంబసభ్యులందరూ అండగా ఉన్నారన్నారు,








