Mahaa Daily Exclusive

  స్టాంప్ వెండర్లకు గిరాకీ లేదు. ఆఫీసుల్లో బేరం లేదు: హరీశ్ రావు

Share

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కళకళలాడుతుండేవని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సిబ్బంది ఈగలు కొట్టుకుంటున్నారని అన్నారు. స్టాంప్ వెండర్లకు గిరాకీ లేకపోవడం, ఆఫీసుల్లో బేరాలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా పడిపోయిందని పేర్కొన్నారు.