Mahaa Daily Exclusive

  బ్రిటీషర్ లతో బీజేపీని పోల్చడం అభ్యంతరకరం కరోనా కంటే భయంకరమైనది కాంగ్రెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ..!

Share

బ్రిటీషర్ల కంటే బీజేపీ ప్రమాదకరమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని కేంద్ర మంత్రి బండి బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాద సిద్ధాంతాలు, నిలువెల్లా దేశభక్తిని పుణికిపుచ్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీని దేశాన్ని దోచుకున్న బ్రిటీషర్లతో పోల్చడం సిగ్గు చేటన్నారు. అవకాశవాద రాజకీయాలకు, అవినీతి పాలనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ పార్టీ. కరోనా కంటే ప్రమాదకరమైన పార్టీ కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామంటూ రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతరంచిపోతున్న జాతిలాంటిదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందో 15 నెలల కాంగ్రెస్ పాలనలో అంతకు రెట్టింపు వ్యతిరేకతను మూటగట్టుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా? అని అడిగారు. తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారు. సిట్టింగ్ సీటైన మల్కాజ్‌గిరి స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు. అక్కడా కూడా బీజేపీ గెలిచింది. స్వయంగా పోటీ చేసిన కామారెడ్డి‌లో బీజేపీ చేతిలో ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయారు. ఎమ్మల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 50 శాతానికిపైగా ప్రాతినిధ్యం బీజేపీ కలిగి ఉందనే విషయాన్ని విస్మరించొద్దన్నారు.
హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ చేసే అభ్యర్థులే కరవయ్యారు. దిక్కులేక హైదరాబాద్ ను మజ్లిస్ చేతిలో పెట్టేందుకు సిద్ధమైన మీరు బీజేపీ కంచుకోటైన గుజరాత్ కు వెళ్లి తెలంగాణలో బీజేపీని అడ్డుకునే శక్తి ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు అంటిన బురదను తుడుచుకోలేని వారు దేశం మొత్తాన్ని క్లీన్ చేస్తాననడం హాస్యాస్పదమన్నారు. రిజర్వేషన్ల ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొట్టేది, మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలేనన్న సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అన్నారు. మీరెన్ని డ్రామాలాడినా తెలంగాణలో అధికారం రావడం పక్కా. మిగిలిన కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనైనా అధికారం కోల్పోకుండా చూసుకుంటే బెటర్ అని సంజయ్ పేర్కొన్నా