రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ గుడ్ న్యూస్ తెలిపారు. గత నెలలో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించనున్నట్టు ప్రకటించారు. మార్చ్ లో కురిసిన వడగళ్ళ వానకు 8,408 ఎకరాల్లో జరిగిన పంట నష్టం జరిగినట్టు గుర్తించామని పేర్కొన్న మంత్రి, రైతులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ అందించిన వివరాల ప్రకారం నష్టపరిహారం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అలాగే ఈనెల 3 నుంచి 9 వరకు కురిసిన వడగళ్ళ వానకు, ఈదురు గాలులకు జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందింది అని, దానిని పరిశీలించి వారికి కూడా పరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు.
Post Views: 152








