Mahaa Daily Exclusive

  సన్నబియ్యం పథకం దేశంలోనే నెంబర్ వన్ కడుపు మంట తో బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ..!

Share

సన్నబియ్యం పథకం దేశంలోని సంక్షేమపథకాల్లో నెంబర్ వన్ అని, ఈ పథకం పేదల కడపునింపుతుండడంతో బీజేపీ, బిఅరెస్ కడుపు మంట తో మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పథకం అమలుపై అధికారులతో సమీక్షించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షాలు ఏదో మాట్లాడాలని మాట్లాడ్తున్నారని, కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం తాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సన్నబియ్యం పై అద్భుతమైన స్పందన ప్రజల నుండి వస్తుందని, ఎవరో ఒకరు విమర్శలు చేసి దాని గొప్పతనాన్ని దెబ్బతియ్యవద్దన్నారు. మంచి ఫైన్ రైస్ బిఅరెస్ బీజేపీ ఇచ్చారా..అలాంటి వారి కోసం మాట్లాడం కరెక్టు కాదన్నారు. 2.8 కోట్ల జనాభాకు దొడ్డు బియ్యం ఇస్తూ.. 10 వేల కోట్లు గతం లో ఖర్చు చేశారని, 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇవ్వడానికి 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో నాణ్యత సరిగా లేకపోవడం వల్ల ఎవరు తినకపోయేవారని, తమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నదన్నారు. గతానికంటే ఖర్చు అధికంగా చేస్తున్నామన్నారు. నిరుపేదల కడుపు నింపడానికి ఖర్చు చేస్తున్నామని, సన్నబియ్యం పథకం లోతుగా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి అని నాయకులను కోరామన్నారు. కాళేశ్వరం కూలిన తర్వాత రికార్డ్ స్థాయి పంట 66.7 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం పండిందని, 10 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో పండని పంట కాంగ్రేస్ హయాంలో పండిందన్నారు. రైతు పక్ష పాత ప్రభుత్వం అని చెప్పడానికి పండిన పంట నిదర్శనమన్నారు. ధాన్యం కొనుగోలు అంశంలో కమిటెడ్ గా ఉన్నామని, సరైన ధర కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఎస్పి , బోనస్ కి కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేస్తున్నామన్నారు.