Mahaa Daily Exclusive

  మహాత్మ జ్యోతిబా పూలేకు సీఎం నివాళి నెక్లెస్ రోడ్డులో విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం..!

Share

మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫూలే జయంతి రోజే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తదితరులతో కలిసి సీఎం స్థలాన్ని పరిశీలించారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ తదితర సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని డిజైనింగ్ రూపకల్పన చేయాలని చేయాలని సూచించారు.

ఫూలే విగ్రహానికి పూలమాల వేసి..

ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా అంబర్‌పేటలో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, నియోజకవర్గ ఇన్‌చార్జి రోహిన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.