Mahaa Daily Exclusive

  భారత రత్న బీఆర్ అంబేద్కర్​కు సీఎం రేవంత్​రెడ్డి నివాళులు..!

Share

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబేడ్కర్​ జయంతి ని పురస్కరించుకుని ఆదివారం ఆ మహనీయునికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్‌ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి పిలుపు నిచ్చారు.