కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మహేష్ గౌడ్ మండిపడ్డారు. హెచ్సీయూలో ప్రధాని మోదీ ప్రారంభించిన 5 బిల్డింగులకు అనుమతులు లేవని.. మున్సిపల్, అటవీ, పర్యావరణ పర్మిషన్లు లేకుండానే లేకుండా భవనాలు నిర్మించారని అన్నారు. అలాగే.. మోదీ ఎన్నికల ర్యాలీల కోసం బీజేపీ లక్షల చెట్లను నరికేసిందని ఆరోపించారు. ఐదేండ్లలో 1.09 లక్షల చెట్లు తొలగించామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తు చేశారు. అంబానీ, అదానీల కోసం బీజేపీ వేల చెట్లను నరికేందన్నారు. చెట్లను నరకడం బీజేపీ సంస్కృతి అని.. చెట్లను నాటడం కాంగ్రెస్ ప్రభుత్వ విధానమన్నారు. ప్రధాని మోడీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని.. ఆయన గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు
Post Views: 160








