Mahaa Daily Exclusive

  మనుస్మృతి తిరోగమన భావజాలానికి అంబేద్కర్ వ్యతిరేకించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి …!

Share

దళితబహుజనులు, మహిళలు, మైనారిటీల హక్కులను తీవ్రంగా సమర్థించే వ్యక్తిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనుస్మృతి తిరోగమన భావజాలానికి తీవ్రంగా వ్యతరేకించేవారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్యెల్యే చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. మనుస్మృతిని అమలు చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
ఆధునిక భారతదేశాన్ని మార్గనిర్దేశం చేసే సమగ్ర భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలను ప్రత్యక్షంగా అమలు చేస్తుందని, చట్టాల సవరణలతో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134 వ జయంతి సందర్బంగా హైదరాబాద్, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అయన విగ్రహానికి చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి. నరసింహ, హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి బి. స్టాలిన్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరుపాక అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చాడ మాట్లాడుతూ, ఒక మార్గదర్శక సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త, రచయిత, బహుభాషావేత్త వక్త, ఆలోచనాపరుడు అంబేద్కర్ అని, భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం, హక్కులు కల్పించాడని గుర్తు చేసారు.