తాను.. మాజీ సీఎం కేసీఆర్ లాగా మంచి దాన్ని కాదని.. మనదంతా రౌడీ టైప్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీల నాయకులు, పోలీసులు సైతం తమను బెదిరించారని కవితకు నేతలు, కార్యకర్తలు చెప్పుకున్నారు. దీనిపై ఎమ్మెల్సీ కవిత తనదైన స్టైట్ లో మండిపడ్డారు. తాను.. మాజీ సీఎం కేసీఆర్ లాగా మంచి దాన్ని కాదని.. మనదంతా రౌడీ టైప్ అంటూ శివాలెత్తిపోయారు. తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసుల్ని పెడుతున్న అధికారులు, వేధిస్తున్న నేతల పేర్లు పింక్ బుక్ లో ఎంట్రీ చేస్తున్నామని ఏ ఒక్కర్ని కూడా వదలమని కూడా హెచ్చరించారు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం.. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ అని ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు.








