కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, నకిలీ వీడియోస్, ఫొటోలు అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయని, భూముల విషయం కోర్టుల పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేమన్నారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. నెమళ్లు జనావాసాల్లోకి రావడం సర్వసాధారణమని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసే కుట్ర పన్నుతున్నట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఈ భూములపై ప్రధాని మోదీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారని, కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం మాదీ కాదన్నారు.
Post Views: 21







