Mahaa Daily Exclusive

  రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటన..!

Share

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో ఆవులు చనిపోయాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటిదేమీ లేదని టీటీడీ ప్రకటించింది. దీనిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు పవన్ గోశాలకు వెళ్లనున్నారు. ముందుగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకొని తర్వాత టీటీడీ గోశాలను పరిశీలించనున్నారు. అక్కడ గోవుల మృతి అంశంపై అధికారులను అడిగి తెలుసుకుంటారు.