Mahaa Daily Exclusive

  అమరావతి భూసమీకరణ వెనుక కుట్ర: నాని

Share

వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మరో 44 వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. అయితే భూ సేకరణలో కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ప్రజా ప్రయోజనం కోసం చంద్రబాబు ఎప్పుడూ ఆలోచించరని అన్నారు. త్వరలోనే అమరావతి మెగా సిటీ కుట్రలన్నీ బయటపడతాయని పేర్కొన్నారు.