Mahaa Daily Exclusive

  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలపై మంత్రి ఆరా ఇప్పటికే 8వేల పోస్టుల భర్తీ మరో 6,200 ఖాళీల భర్తీకి కసరత్తు మంత్రి దామోదర రాజసర్సింహ ..!

Share

ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. గతేడాది 8 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 6200లకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇందులో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయని వివరించారు. ఈ పోస్టులన్నింటికీ రాత పరీక్షలు పూర్తి కాగా, వెంటనే ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు.

ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు

సరియైన కారణం లేకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సి – సెక్షన్ ఆడిట్‌ను మరింత పక్సడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో నార్మల్ డెలివరీల సంఖ్యను మరింత పెంచాలన్నారు. నార్మల్ డెలివరీ వల్ల కలిగే లాభాలను, సి సెక్షన్ వల్ల జరిగే నష్టాలను యాంటి నాటల్ చెకప్స్ సమయం నుంచే గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరించాలన్నారు. నార్మల్ డెలివరీల సంఖ్య పెంచేందుకు, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు. మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో వసతులను మరింత మెరుగు పర్చాలని, ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని ఆదేశించారు.
ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల హాస్పిటల్స్‌లో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.