పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శనివారం మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం నుంచి కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ బీజేపీకి ఊడిగం చేస్తున్నారన్నారు. కట్టు బానిసల పనిచేస్తున్నారని, బీఆర్‌ఎస్ బలహీనత వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావడం లేదంటూ విమర్శించారు. గత పదేళ్లపాటు మోదీ తీసుకున్న నిర్ణయాలకు బీఆర్‌ఎస్ మద్దతిచ్చిందన్నారు.
Post Views: 43








