పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)ను డీఎంకే వ్యతిరేకించలేదని, జనాభా ప్రాతిపదికన చేపట్టే కొలమానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. డీలిమిటేషన్‌ను న్యాయమైన కారణాలతో వాయిదా వేయాలని కోరుతున్నామని తెలిపారు. తమిళనాడు అభివృద్ధిని నాశనం చేసే ఉద్దేశంతో కేంద్రం త్రిభాషా విధానాన్ని రుద్దేందుకు ప్రయత్నించడంతోనే దానిని బలంగా వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ వెల్లడించారు.
Post Views: 102








