Mahaa Daily Exclusive

  హారన్లుగా భారతీయ సంగీత వాయిద్య శబ్దాలు: గడ్కరీ

Share

భారతీయ సంగీత వాయిద్యాల నుంచి వచ్చే శబ్దాన్ని మాత్రమే వాహనాలకు హారన్‌గా వినియోగించుకునేలా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఫ్లూట్‌, తబలా, వయెలిన్‌, హార్మోనియం వంటి వాయిద్య పరికరాల ద్వారా రూపొందించిన వినసొంపైన శబ్దాన్నే వినియోగించేలా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. వాయు కాలుష్యంలో రవాణా రంగం వల్లే 40 శాతం జరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.