Mahaa Daily Exclusive

  అమరావతి నిర్మాణ పునఃప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు: మంత్రి నారాయణ

Share

అమరావతి నిర్మాణ పునఃప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి నారాయణ సోమవారంపేర్కొన్నారు. ఆరోజు అమరావతిలో మోదీ రోడ్‌షో ఉంటుందని.. రూ.లక్ష కోట్ల విలువైన రాజధాని పనులను ప్రధాని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ‘ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది జనం వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలనూ ఆహ్వానిస్తాం. అమరావతిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.” అని మంత్రి వెల్లడించారు.