లగచర్ల ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఎన్హెచ్ఆర్సీ నివేదికలో వెల్లడించిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇంతకాలంగా తాము చెబుతున్న విషయాన్ని NHRC నివేదిక బయటపెట్టిందన్నారు. “లగచర్ల రైతులు, మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఈ నివేదిక ద్వారా బహిర్గతమైంది. సర్కార్ చర్యలపై పోరాడిన గిరిజనులందరికీ అభినందనలు.” అని కేటీఆర్ ఎక్స్‌లో సోమవారం ట్వీట్ చేశారు.
Post Views: 31








