Mahaa Daily Exclusive

  సొంతూరి సేవలో.. సీఎం ప్రధానసలహాదారు వేం నరేందర్ రెడ్డి…!

Share

రాష్ట్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రజాసంబంధాలు, పాలనా వ్యవహారాల్లో ఎపుడూ బిజీగా ఉండే.. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వీలుచిక్కినపుడల్లా సొంతూరి ప్రజల సేవలో నిమగ్నవుతారు. ముఖ్యమంత్రి జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో సమయం చూసుకుని గత రెండురోజులుగా స్వగ్రామ, మండల ప్రజల సమస్యలు విన్నారు. పలు సమస్యలను అప్పటికపుడే పరిష్కరించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం మండలం ఆర్పన్ పల్లి గ్రామంలో ఉంటూ స్థానిక ప్రజల నుంచి ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించి,సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారం చూపారు. కేసముద్రం మండల కేంద్రానికి అగ్నిమాపక కేంద్రం, షాదీఖానా, గ్రామాలకు రోడ్లు మంజూరు కావడంతో స్థానిక ముస్లిం నాయకులు,కార్యకర్తలు వేం నరేందర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు