AP: నిరుద్యోగ యువతకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుభవార్త చెప్పారు. శుక్రవారం కడప జిల్లాలో మంత్రి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం ఆదేశాల మేరకు 20 ఎకరాల ఐటీ పార్కు కోసం స్థల పరిశీలన చేస్తున్నాం. ఈ పార్కును అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం. కడప జిల్లాలో భారీ కంపెనీలు రావడానికి ప్రయత్నం చేస్తామని’ మంత్రి పేర్కొన్నారు.
Post Views: 91








