కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై BRS నేతలు సిగ్గుపడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్ల మేర ప్రజలను ఆర్థికంగా తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మీడియా ముందు ఆరోపించారు. తెలంగాణ ప్రజలతో BRS క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Post Views: 94








