48 గంటల్లో పాకిస్తానీలు దేశం వదలి వెళ్లిపోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం వీసాల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఉంటున్న పాకిస్తానీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో .. ‘తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదు. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుంచి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాల్సిందే. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు.
Post Views: 117







