కాటారం, మహా :ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని శాంతి చర్చలు జరపాలని కోరుతూ
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి, కూడా చైర్మన్ రెడ్డి ఇనుముల వెంకట్రామిరెడ్డి లకు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు.
దండకారణ్యం లో చత్తీస్గడ్ రాష్ట్రం తెలంగాణ సరిహద్దు ఆదివాసి ప్రాంతం కర్రెగుట్టలపై బాంబులు, తుపాకి మోతలతో దద్దరిల్లుతున్నాయని……ఆదివాసి జాతులను కనుమరుగై పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమై ఆపరేషన్ కగార్ ఎత్తివేసేలా మావోయిస్టుతో ఆదివాసులతో చర్చలు జరిపేలా చూస్తామని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, కార్పొరేషన్ చైర్మన్లు ఐత ప్రకాశ్ రెడ్డి, వెంకట్రాంరెడ్డిలు హామీ ఇచ్చినట్లు తెలంగాణ ప్రజాఫంట్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య దాసరి రమేష్.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకుడు
దారకొండ సూర్య శంకర్ లు పాల్గొన్నారు.








