Mahaa Daily Exclusive

  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన షాద్‌నగర్ వీర్లపల్లి ఎమ్మెల్యే శంకర్ …!

Share

షాద్ నగర్, మహా:రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. రైతులు కష్టించి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన సూచించారు. మంగళవారం షాద్‌నగర్ మార్కెట్ యార్డ్‌లో కొందుర్గు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 2320, సాధారణ రకానికి రూ. 2300 మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రవాణా, హమాలీ ఛార్జీలు మరియు గోనె సంచుల కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడినిచ్చే పంటలు సాగు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కొందుర్గ్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, కొందుర్గ్ మరియు ఫరూఖ్‌నగర్ ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు బక్కన్న యాదవ్, దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మల్లేష్, కరుణాకర్, భాస్కర్, నవీన్, భరత్, రవినాయక్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, అగ్గనూర్ బస్వం, ఇబ్రహీం, బాలరాజు గౌడ్, సుదర్శన్ గౌడ్, హరినాద్ రెడ్డి, నర్సింలు, కుమారస్వామి గౌడ్, చంద్రశేఖర్, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాస్, కొమ్ము కృష్ణ, మహబూబ్ షరీఫ్, రఘునందన్ సుదర్శన్, అనిల్, గంగమోని సత్తయ్య మరియు పలువురు ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు