Mahaa Daily Exclusive

  మోదీ పథకాలపై ప్రజల్లోకి బీజేపీ ప్రచారం… రావిర్యాలలో గావ్ చలో – బస్తీ చలోకి ఘన స్పందన!

Share

షాద్ నగర్, మహా: చౌదర్ గూడెం మండలంలోని రావిర్యాల గ్రామంలో మండల ఉపాధ్యక్షుడు కొండా శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో “గావ్ చలో – బస్తీ చలో” కార్యక్రమాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, పాలమూరు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోంది. మోదీ గారి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా కోట్లాదిమందికి లబ్ధిని కలిగిస్తున్నాయి. తెలంగాణలో కూడా ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి బూత్ స్థాయిలో బీజేపీ బలోపేతం కావాలి” అని అన్నారు.కార్యక్రమంలో నాయకులు గ్రామంలో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని మోదీ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా అంగడి వాడి, రేషన్ షాప్, కుట్టుమిషన్ షాప్ లను సందర్శించి మోదీ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి చర్చ జరిపారు.ఈ సందర్భంగా గ్రామంలోని సోమలింగేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికీ అభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయ కుర్మయ్య, పసుపుల ప్రశాంత్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ అనిల్, గొల్ల రాజు, భూత్ అధ్యక్షులు ధీమా యాదయ్య, రాజు, పరిగి శివ కుమార్, విటలయ్య, సత్యం, ఇస్తారయ్య, లక్ష్మయ్య, చెనగాళ్ల యాదగిరి, చిల్ల రమేష్, కోట్ల ప్రశాంత్ రెడ్డి, గోధుమరాసి మల్లేష్, దశరథం, చిల్ల తిరుపతయ్య, పవన్ కుమార్, K. శ్రీను, M. శ్రీను తదితరులు పాల్గొన్నారు.బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో మోదీ ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసం కల్పించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.