మహా భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం నేడు పాల్వంచలోజరగనున్నట్లు డీసీసీ అధ్యక్షులు పొదేం వీరయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డిసిసి పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశం పాల్వంచలోని హోటల్ వజ్ర లో మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశం కు తెలంగాణ రాష్ట్ర పిసిసి నియమించిన పరిశీలకులు ప్రమోద్ కుమార్ ,శ్రవణ్ కుమార్ హాజరువ్వనున్నారని తెలిపారు.
సంస్థాగత సన్నద్ధతను సమీక్షించడానికి, అట్టడుగు స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఈ కీలక సమావేశాన్ని ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుత మరియి మాజీ- పోటీచేసిన ఎంపీ, యం యల్ ఏ, యం ఎల్ సి, జడ్పీ చైర్మన్ లు, అన్ని మండల, పట్టణ మరియు బ్లాక్ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల నాయకత్వం, ముఖ్య నాయకులు కార్యకర్తలు, మాజీ మరియు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, ఆఫీస్ బేరర్లు, కమిటీ సభ్యులు అందరూ తప్పకుండా ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.








