ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అన్యాయంపై పేదల అందోళనకు దిగిన ఘటన మంగళవారం కారేపల్లి మండల ఉసిరికాయలపల్లిలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు గతం గ్రామసభ పెట్టిన ఎంపిక చేసిన వారికి రాకుండా అనర్హులకు ఇండ్లు మంజూరు కావటంతో పేదలు అగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బాధితులు ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట అందోళనకు దిగారు. ఈసందర్బంగా మాజీ సర్పంచ్ బానోత్ బన్సీలాల్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి మల్లయ్యలు మాట్లాడుతూ గ్రామసభలో ఏకగ్రీవంగా 40 మంది నిరుపేదలను ఎంపిక చేసి అధఇకారులు ఇవ్వటం జరిగిందన్నారు. ఆ జాబితాను పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల కమిటీ అయిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు పేదలు, ఇండ్లు లేనివారిని పక్కన పెట్టి, తమ కార్యకర్తలు, గ్రామంలో లేని పలుకుబడి కల్గినవారి ఇండ్లు మంజూరు చేశారని దుయ్యబట్టారు. నిజమైన పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని అధికారులు వెంటనే రీ సర్వే చేసి అర్హులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యదర్శి నిరంజన్ కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ లాకావత్ చంద్రశేఖర్, బీ.బాలు, దాసరి సైదులు, ఎం.బాలుచౌహన్, లలితమ్మ, రవికుమార్, వాంకుడోత్ చిన్నా, రాములు వినోజ్ కుమార్, జీ.నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.








