Mahaa Daily Exclusive

  సోసైటీ ని సందర్శించిన డీసీసీబీ సీఈవో బ్యాంకు విస్తరణకు అవసరాలకు స్ధల పరిశీలన…!

Share

కారేపల్లి, మహా ,

కారేపల్లి సహకార సంఘాన్ని ఖమ్మం డీసీసీబీ సీఈవో వెంకట అదిత్య మంగళవారం సందర్శించారు. సోసైటీ పరిసరాలు, ఎరువుల గోడౌన్‌ను పరిశీలించారు. డీసీసీబీ బ్యాంకు విస్తరణలో భాగంగా అవసరమైన భవననిర్మాణానికి కావల్సిన స్ధలాలను ఆయన పరిశీలించారు. సోసైటీ కి చెందిన స్ధలంలో బ్యాంకు నిర్వాహణకు కావల్సిన భవన నిర్మాణం చేయటంపై సాధ్యసాధ్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం సోసైటీ కార్యాలయం, డీసీసీబీ బ్రాంచిలో సమీక్షనిర్వహించారు. సోసైటీ అందిస్తున్న సేవలు, రుణాలు, ఆర్ధిక పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. సోసైటీ ద్వారా దీర్ఘకాలిక రుణాలను అందించాలని కార్యదర్శిని ఆదేశించారు. కారేపల్లి సోసైటీ ఫార్మర్‌ ప్రోడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ గా ఎంపికైందని ఎఫ్‌పీవో గా రైతులకు అవసరమైన ఉత్పత్తి, సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సోసైటీలో నగదు రహిత లావాదేవీల నిర్వాహణపై యూపీఏ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. సీఈవో వెంట డీజీఎం వేణుగోపాల్‌, ఏజీఎం ప్రవీణ్‌కుమార్‌, కారేపల్లి బ్రాంచి మేనేజర్‌ బాల రవికుమార్‌, సూపర్‌వైజర్‌ కొంగర వేణు, కార్యదర్శి బొల్లు హనుమంతరావు తదితరులు ఉన్నారు.