Mahaa Daily Exclusive

  గ్రామ పండుగలు ప్రజల ఐక్యతకు నిదర్శనాలు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి…!

Share

తొర్రూర్, మహా; తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో గౌడ కులస్తులు నిర్వహించిన శ్రీ కంఠ మహేశ్వర స్వామి పండుగలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి పాల్గొన్నారు
పండుగ సందర్భంగా గ్రామస్థులు ఎమ్మెల్యే ని ఘనంగా స్వాగతించి సత్కరించారు.అనంతరం మంగళ వాయిద్యాల మధ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పండుగ ఉత్సవాల్లో వారు ఉత్సాహంగా పాల్గొని స్థానికులతో ఆత్మీయత నింపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భక్తి భావం, సంప్రదాయ సంస్కృతి కలబోసిన గ్రామ పండుగలు ప్రజల మధ్య ఐక్యతకు, సాంప్రదాయ పరిరక్షణకు అమ్మాపురం గ్రామ గౌడ కులస్తులు ఎంతో భక్తి పారవశ్యoతో నిర్వహిస్తున్న తీరు నిజంగా అభినందనీయమన్నారు.
ప్రాచీన దేవాలయాలు మన సంస్కృతి పరిరక్షణకు,మన ఆధ్యాత్మిక శక్తికి రూపాలు. వీటి అభివృద్ధికి నేను అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు. అమ్మాపురం గ్రామ అభివృద్ధికి కూడా నా పూర్తి సహకారం అందిస్తాను అని హామీ ఇచ్చారు.అదేసమయంలో, గ్రామస్థులు ఎమ్మెల్యే గ్రామ అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారు.వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకుంటానని వారు హామీ ఇచ్చారు.పండుగ కార్యక్రమం పూర్తిగా భక్తి మయంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. గ్రామస్థులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ, పండుగ విజయవంతానికి వారి మద్దతుకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు, మండల ముఖ్యనాయకులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళ నాయకులు, గౌడ కులస్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.