Mahaa Daily Exclusive

  భూ భారతి చట్టం రైతులకు వరం …!

Share

మేళ్లచెరువు,మహా: మేళ్లచెరువు మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరం ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకురావడం రైతులు వరంలా భావించాలన్నారు ఈ చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. గతంలో ఆన్లైన్లో అవకతవకలు ఎన్నో జరిగాయన్నారు. రైతులకు భూ సమస్యలు ఏమైనా ఉంటే గ్రామాలలోకి వచ్చి అన్ని విధాల సర్వే చేసి మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే ముందు రోజుల్లో భూ ఆధార్ కార్డ్ గవర్నమెంట్ నుంచి రైతులకు ఇవ్వబోతున్నామన్నారు. భూ భారతి చట్టం 2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు, కుటుంబంలో ఒక్కడే తండ్రి ఆస్తిని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆన్లైన్ ద్వారా ఎక్కించుకునే వారిని ఇకమీదట అలా జరగకుండా వీఆర్వో స్థాయి నుంచి పరిష్కరించుకుంటూ వస్తారన్నారు. అలా కూడా న్యాయం జరగకపోతే ఆర్డీవో స్థాయి దాక వెళ్లొచ్చని అక్కడ మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని వివరించారు. ఇకమీదట అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుందని.. రైతులకు న్యాయం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు తహశీల్దార్ పి జ్యోతి, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్, మేళ్లచెరువు దేవాలయ చైర్మన్, మేళ్లచెరువు సొసైటీ చైర్మన్, మేళ్లచెరువు ఎస్ఐ,రైతులు, గ్రామ ప్రజలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.