Mahaa Daily Exclusive

  *జిల్లాలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి పర్యటన ఘన స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు..!

Share

ఖమ్మం – మహా.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మాధవికి ఘన స్వాగతం పలికారు. తొలుత బైపాస్ రోడ్డూలోని రాపర్తినగర్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బిజెపీ శ్రేణులకి పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. అనంతరం మధవి, కోటేశ్వర రావులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవిని శాలువాతో సత్కరించి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అందాజెశారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు కొటేశ్వర రావు ఆధ్వర్యంలో నగరంలోని హొటల్ మినార్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా రాజకీయలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉగ్ర దాడిపై మాట్లాడారు. అనంతరం కృషి భవన్ కూడలిలో పాకిస్తాన్ జెండాను కాళ్లతో తొక్కుతూ ఉగ్రవాదం నశించాలి అని నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తా వెంకటేశ్వరావు , మంద సరస్వతి, వేల్పుల సుధాకర్ , నీరుకొండ ఉషారాణి, నల్లగట్టు ప్రవీణ్ కుమార్,గుగులోతు నాగేశ్వరరావు, అల్లిక అంజయ్య, విజయ రెడ్డి , అనిత , దొడ్డ అరుణ , బండారు నరేష్, తోడుపునూరి రవీందర్ , రవి రాథోడ్, ,నెల్లూరు బెనర్జీ ,గడీలనరేష్, అంకతి పాపారావు,కుమిలి శ్రీనివాస్, మాధవ్, మణి, కొమ్మ మధు ,దాసు, రజనీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.