Mahaa Daily Exclusive

  శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు …!

Share

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (మహా)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన ఏఎస్సై సోమేశ్వర రావును జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఏఎస్సైగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన సోమేశ్వరరావును ఎస్పీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన అధికారులు మరియు సిబ్బంది తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అన్నారు. గత 40 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ,పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో విధులను నిర్వర్తించి పదవీ విరమణ పొందిన సోమేశ్వరరావు సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షులు ఏసోబు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.