Mahaa Daily Exclusive

  రైతులకు ఇబ్బందులు కలగకూడదు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాయం ..!

Share

మణుగూరు, మహా ; మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాభవన్ లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని రైతులకు అందించే సేవలు పై మాట్లాడారు.వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించిన కార్యక్రమాలు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్న బియ్యానికి రూ,500 ల బోనస్, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇలా అనేక విషయాలపై చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాలలో సకాలంలో ఎరువులు విత్తనాలు రైతులకు ఏది అవసరం అనేదానిపై ప్రత్యేక దృష్టికి పెట్టాలన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులకు అభినవ సంబంధాలు ఉంటాయని వాటిని ఎప్పటికీ అదేవిధంగా కొనసాగించాలని రైతులకు కష్టం కలగకుండా మెరుగైన సేవలు అందించాలన్నారు.
కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడిఏ తాతారావు,పిఏసిఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి,నియోజకవర్గస్థాయి వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.