Mahaa Daily Exclusive

  కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ప్రారంభం…!

Share

కరీంనగర్, మహా:

సమ్మర్ క్యాంపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ రంగంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
కలెక్టరేట్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ శిక్షణ తరగతులను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ళలో చదివే విద్యార్థులు వేసవి సెలవుల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ ప్రారంభించినట్లు చెప్పారు. నాలుగు వారాలపాటు జరిగే శిక్షణలో 50 మంది విద్యార్థులకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, ఫోటోషాప్ స్కిల్ లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం 25 మందికి సాయంత్రం 25 మంది విద్యార్థులకు థియరీతోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని విజయవంతంగా శిక్షణ పూర్తి చేయాలని అన్నారు. నేటి రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఉద్యోగానికి తప్పనిసరి అని, కంప్యూటర్ శిక్షణ భవిష్యత్తులో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఫోటోషాప్ సృజనాత్మక నైపుణ్యమని, డిజైనింగ్ విజువల్ కమ్యూనికేషన్ రంగాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ ఒక పేజీ చేతి వ్రాత ప్రాక్టీస్ చేయాలనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, నెహ్రూ యువకేంద్ర కోఆర్డినేటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం మేనేజర్ రాంబాబు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, కేజీబీవీ కోఆర్డినేటర్ కృపారాణి, సంతోష్ పాల్గొన్నారు.