రీంనగర్, మహా:
ఇటీవల జేఈ మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదలైన సందర్భంగా కొన్ని విద్యాసంస్థలు రిజర్వ్డ్ కేటగిరి ర్యాంకుల ను జనరల్ కేటగిరి ర్యాంకులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒక ప్రముఖ విద్యా సంస్థ 49 వ ర్యాంకు రిజర్వ్ కేటగిరికి చెందిన (వికలాంగుల కోట) ర్యాంకు వస్తే దానిని రిజర్వ్ కేటగిరి కింద చూపెట్టకుండా జనరల్ కేటగిరీగా చూపిస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఒక విద్యాసంస్థల్లో 17వ రిజర్వ్ ర్యాంకును జనరల్ ర్యాంకుగా చూపిస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు కానీ 49వ ర్యాంకును కూడా ఇలాగే చూపిస్తున్న దానిని ఎందుకు బహిర్గతం చేస్తలేరు. కాబట్టి నగరంలోని అన్ని విద్యాసంస్థలకు సంబంధించిన ర్యాంకులపై వాటి ప్రకటనలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అలాగే వారి యొక్క కళాశాలలో ఎంత మంది విద్యార్థులు వార్షిక పరీక్ష హాజరైనారు ఎంత మంది ఉత్తీర్ణత పొందినారు ఎంతమంది ఫెయిల్ అయినారు అనే వివరాలు కళాశాల యజమాన్య కానీ లేదా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు గానీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వేల సంఖ్యలలో విద్యార్థులు పరీక్షకు హాజరైతే వందల సంఖ్యలో విద్యార్థులు పాస్ అవుతున్నారు వీటిని దాచి విద్యార్థులను తల్లిదండ్రులను కళాశాల యజమాన్యాలు మోసం చేస్తున్నాయి. విద్యార్థులారా తల్లిదండ్రులారా ఈ మోసాన్ని గమనించి ఆ కళాశాల యొక్క ఉత్తీర్ణత ర్యాంకులను పరిశీలించిన పిమ్మటనే అడ్మిషన్ పొందాలని వ బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతున్నాం







