Mahaa Daily Exclusive

  ఏఐటియుసి పోరాట ఫలితం అంగన్వాడీలకు మే నెల మొత్తం సెలవులు – రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ …!

Share

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (మహా):
ప్రస్తుతం మండుతున్న వేసవి ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలకి చిన్నారులు, గర్బవతులు రాలేని పరిస్థితిని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల నేపద్యంలో, తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఐసీడీఎస్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఐసీడీఎస్ చరిత్రలో వేసవి శెలవులు టెక్ హామ్ రేషన్ పద్దతిలో లబ్దదారులకు ఫీడింగ్ అందించి సెంటర్స్ కు రాకుండా సెలవలు ప్రకటించటం జరిగిందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి ప్రసాద్ తెలియచేసారు. ఐసీడీఎస్ కమిషనర్ తో హైదరాబాద్ లో జరిగిన చర్చల్లో వారు సెలవులు ప్రకటించడం హర్షణీయమని ప్రసాద్ తెలిపారు.
మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ప్రమోట్ చేస్తూ టీచర్ గా పని చేస్తున్న వారికి వేతనం 6,750 నుండి 13,650 రూపాయలకు పెంచుతూ, మే నెల నుండి వేతనం అందించనున్నట్లు ఐసిడిఎస్ శాఖ కమిషనర్ క్రాంతి వెస్లీ ఏఐటీయూసీ నాయకులకి బుధవారం జరిగిన కార్మిక సంఘాల జాయింట్ మీటంగ్లో తెలియ చేశారని ప్రసాద్ తెలిపారు.
పోరాటాల ద్వారానే హక్కులు సాధించ వచ్చుని మరోసారి నిరూపణ జరిగిందని, వేసవి సెలవలు ప్రకటించిన ప్రభుత్వానికి మంత్రి సీతక్క కి అధికారులకు ఏఐటీయూసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఏఐటీయూసీ అంగన్వాడీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గోనె మణి ప్రధాన కార్యదర్శి రెడ్డి అరుణ, భూక్య లలిత, కృతజ్ఞతలు తెలిపారు.