కూసుమంచి, మే 15, మహా:
ప్రజలకు సేవ చేయడంలో ముందుండే ఇంటూరి నాగరాజు చౌదరికి చెందిన స్వంత ఆసుపత్రికి అరుదైన గుర్తింపు లభించింది. ఆసుపత్రి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అవార్డును పొందారు.. వారి నుంచి ప్రశంసలు అందుకున్నారు. పూర్తి వివరాల్లోకి తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించిన కేటగిరిలో కూసుమంచి వజ్ర ఆసుపత్రికి విస్సా హెల్త్ ఎక్స్ అవార్డ్ 2025 అందించింది. వజ్ర ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఇంటూరి నాగరాజు చౌదరి ఆ అవార్డును అందుకున్నారు. పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమం శాఖల మంత్రి సీతక్క,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా విస్సా హెల్త్ ఎక్స్ అవార్డు అందుకున్నట్లు తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో గ్రామీణ పేద ప్రజలకు తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య సేవలు అందించినందుకు ఈ అవార్డు అందించినట్లు నాగరాజు చౌదరి వెల్లడించారు. అత్యంత విశ్వసనీయమైన ప్రతిష్టాత్మకమైన హెల్త్‌కేర్ ఎక్స్ అవార్డును వివిధ విభాగాల్లో హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ హాల్లో అందించినట్లు వెల్లడించారు. అవార్డు గెలుచుకున్న వజ్ర ఆసుపత్రి మరింత విశ్వాసం ప్రామాణికతను అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. లోతైన పరిశోధన, సర్వే ప్రక్రియ నాణ్యత, అనుభవం, అర్హతలు, కస్టమర్ అభిప్రాయం మొదలైన పరిమితులపై వివిధ విభాగాల్లో విజేతలను ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లలో తమ ఆసుపత్రి ఈ అవార్డు దక్కించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వజ్రా ఆసుపత్రికి అవార్డు రావడంతో ఆ ఆసుపత్రి బాధ్యులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. మండల ప్రజలు అభినందనలు తెలిపారు.. వజ్రా ఆసుపత్రికి కూసుమంచి జర్నలిస్ట్ కమిటీ తరుపున అభినందనలు తెలిపారు.








