Mahaa Daily Exclusive

  సేంది వ్యవసాయం ద్వారా రైతుకు లాభసాటి కలుగును..!

Share

కామేపల్లి, మే,15- మహా సమాజంలో రైతులందరూ సేంద్రియ వ్యవహార పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేయడం ద్వారా అధిక లాభం చేకూరుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్ర వ్యవసాయ శాస్త్రవేత్తలు రవి, రమాదేవి లు అన్నారు గురువారం మండల పరిధిలోని పాతలింగాల గ్రామంలో రైతు వేదికలో, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో భాగంగా సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయంపై మక్కువ చూపిస్తూ అధిక రసాయనిక ఎరువులు వాడుతున్నారని దాని ద్వారా పంటసారవంతం దెబ్బతింటుందని అన్నారు, వ్యవసాయం సాగు దీర్ఘకాలికంగా అణువులోకి రాకుండా స్వల్పకాలికంగా భూమి వినాశనానికి గురి అవుతుందని సూచించారు, రైతులు వ్యవసాయ సాగు క్రమం ముందు పంట భూసార పరీక్షలు నిర్వహించుకుని తగు సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా పంట ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు, రైతులందరికీ సేంద్రియ ఎరువులపై తగు పరిజ్ఞానం అవసరమని సూచించారు, రైతుల తప్పనిసరిగా సేంద్రియ పద్ధతిలోని వ్యవసాయాన్ని సాగు చేయాలని కోరారు, తప్పనిసరిగా రైతులందరూ భూ యాజమాన్యం సాగు యాజమాన్యం పద్ధతులను అవలంబించాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు,మండల వ్యవసాయ అధికారి తారా దేవి వ్యవసాయ శాఖ సిబ్బంది కాంగ్రెస్ మండల అధ్యక్షులు గింజలను నర్సిరెడ్డి, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు