కూసుమంచి, మే 15, మహా:
మండలంలోని మునిగేపల్లి గ్రామానికి చెందిన రామా నరేందర్ పెద్ద కుమారుడు రాహుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా తన మొదటి నెల జీతమును మునిగేపల్లి గ్రామానికి చెందిన వికలాంగులకు ట్రై సైకిల్, వృద్ధులకు నిరుపేదలకు రూ.4000 చొప్పున నగదును మొత్తంగా సుమారు 50 వేల రూపాయల విలువైనటువంటి ఆర్థిక చేయూతను వితరణ చేశారు. కాగా గురువారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, రామ శ్రీనివాసరావు చేతులు మీదుగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయస్సులో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మంచి పరిణామమని కొనియాడారు. భవిష్యత్ లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిగేపల్లి కాంగ్రెస్ నాయకులు ఎస్కే. సైదులు, అప్పగాని రామ్మూర్తి, రామా నరేందర్, రామా నాగేశ్వరరావు, కామినేని అజయ్, ములుగురు బొందయ్య ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ రాహుల్ ని చిన్న వయసులో సేవా భావాన్ని కలిగి ఉండటాన్ని గ్రామ పెద్దలు అభినందించినారు..








