Mahaa Daily Exclusive

  సింగరేణి ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన సింగరేణి సంస్థ ఛైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ బలరాం..!

Share

 భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా):
 సింగరేణి సంస్థ  ఛైర్మన్ మేనేజింగ్  డైరక్టర్ ఎన్. బలరాం గురువారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా    ఎన్. బలరామ్, ప్రధాన ఆసుపత్రిలోని అత్యవసర వార్డుతో పాటు అన్ని వార్డులను మరియు ఆసుపత్రిలో ఉద్యోగులకు  వైధ్య సేవలు అంధించే  అన్ని విభాగాలను, ఫార్మసీని  తనిఖీ చేశారు. ఫార్మసీలో లభ్యమయ్యే మందుల వివరాలను ఫార్మసిస్ట్ లను,  వార్డులలో గల రోగుల వివరాలను సంబంధిత డాక్టర్లను మరియు నర్సులను అడిగి తెలుసుకొని రోగులతో వారి వారి అనారోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 అనంతరం ఆసుపత్రి లో వేచి ఉన్న కొందరు ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యుల ద్వారా ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా చికిత్స నిమిత్తమై వేచి ఉన్న మరి కొందరిని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
  ఈ సంధర్భముగా  బలరాం మాట్లాడుతూ, సింగరేణి సింగరేణి సంస్థ కార్మికుల మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని  యాజమాన్యం ఎక్కడా కూడా ఖర్చుకు వెనుకాడక అత్యుత్తమ రీతిలో వైద్యం, పౌష్టికాహారం అందిస్తుందని, కార్మికులు వారి కుటుంబ సభ్యులు త్వరితగతిన కోలుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలియజేశారు. అందులో భాగంగా సింగరేణి ప్రధాన ఆసుపత్రి సహా అన్ని ఏరియా ఆసుపత్రులను ఆధునీకరించామని,  అంతర్గత మెడికల్ ఆఫీసర్స్ ఇటీవల స్టడీ లీవ్ పై స్పెషలిస్ట్ కోర్స్ పూర్తి చేసుకొని వచ్చారని, అన్ని స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండేందుకు వీలుగా మరికొంత మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించుకోబోతున్నామని, ఉద్యోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే దిశగా తీసుకున్న చర్యలలో భాగముగా ప్రాధమికంగా ఈ మద్య కీళ్ల మార్పిడి ఆపరేషన్లను మన ఆసుపత్రులలోనే కూడా విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు. అతి త్వరలో సింగరేణి సంస్థ హైద్రాబాద్ నందు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించటానికి ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.
అదే విధంగా రోగులకు కావలసిన అన్నీ మందులను అందుబాటులో ఉండేలా చూడాలని, ఉద్యోగులకు ఇంకా మెరుగైన వైధ్య సేవలు అందించేందుకు చేపట్టవలసిన చర్యల గురించి సి‌ఎం‌ఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ గారికి సలహాలను సూచించారు. అత్యవసర వార్డు ను ఈ‌ఆర్( ఎమర్జెన్సీ రెస్పాన్స్ డిపార్ట్మెంట్) గా మార్చి  లైఫ్ సేవింగ్ ప్రొసెడ్యుర్ (లైఫ్ సేవింగ్ ప్రొసీజర్)   అందేలా చూసి మెరుగైన వైధ్య సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో  సి‌ఎం‌ఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్, ఏసిఎంఓలు  ఎం.ఉష, సునీలా, సీనియర్ పిఓ మండల శ్రీనివాస్, అన్ని స్పెషలైజేషన్ల డాక్టర్లు, మెడికల్ సూపరింటెండెంట్ లు తదితరులు  పాల్గొన్నారు.