నేలకొండపల్లి, మే 15 మహా:
ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల ను హౌసింగ్ ఏఈ వి. లింగా పరిశీలించారు. నూతనంగా నియమించిన ఏఈ గురువారం మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో యర్రయ్య సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిరుమలాపురంతండా లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు… మండలం లోని ఇందిరమ్మ ఇళ్ల ను నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కోన్నారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా . చర్యలు చేపడతామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పై లబ్దిదారులకు అవగాహాన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ -కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 29








