Mahaa Daily Exclusive

  బూటకపు ఎన్కౌంటర్ హత్యలను మానుకోవాలి? సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత, ఎం, గిరి డిమాండ్..!

Share

బోనకల్ – మహా.
జనవరి నుండి ఆపరేషన్ కగార్ పేరుతో తీవ్రస్థాయిలో కొనసాగిస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను మానుకోవాలని నక్సలైట్ మావోయిస్టులైన ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన హత్యలు చేయమని భారత రాజ్యాంగం ఈ ప్రభుత్వాలకు చట్టబద్ధ హక్కులేమి ఇవ్వలేదని ఒకవేళ తప్పు చేసిన చట్టపరంగా శిక్షించాల్సి ఉంటుందని చేసిన నేరాన్ని బట్టి శిక్షలు ఉంటాయి తప్ప పోలీసులు శిక్షిస్తే ప్రభుత్వ పాలన కోర్టులు సెక్షన్లు చట్టాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాం
కొన్ని కేసుల్లో ఎవరు ఫిర్యాదు చేయకపోయినా కోర్టులే స్పందించి సుమోటోగా తీసుకున్న అనేక సందర్భాలు ఉన్నాయి ఇంత దారుణ మారణ ఖండ జరుగుతుంటే కోర్టులు పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు.