Mahaa Daily Exclusive

  ప్రజల రుణం కార్యకర్తల కష్టాన్ని ఎన్నటికీ మర్చిపోను కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..!

Share

వరంగల్, మహా;

వర్ధన్నపేట టౌన్ లోని ఏబీఎస్ గార్డెన్స్ నందు వర్ధన్నపేట టౌన్, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల 3, 14, 43, డివిజన్ల నాయకలతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అబ్జర్వర్ అమర్ అలీ ఖాన్, మేడి రవిచంద్ర, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

ప్రజల రుణం కార్యకర్తల కష్టాన్ని మర్చిపోను అని,కష్టపడ్డ ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. నియోజకవర్గంలో రాబోయే కాంగ్రెస్ పార్టీ కమిటీ కమిట్మెంట్ తో పనిచేసే నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందని కాంగ్రెస్ పార్టీయే నా గ్రూపు అని తెలిపారు. సమర్థ నాయకత్వం ద్వారానే పార్టీ బలోపేతం అవుతుందని,ప్రజలకు కార్యకర్తలకు సేవ చేసే నాయకత్వాన్ని ఎంపిక చేయండి అని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో పదవైన, ప్రజా ప్రతినిధి పదవి అయినా పార్టీకి ప్రజలకు సేవ చేయాలని, బాధ్యత గా నిర్వహించే నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. గ్రూపులు పెట్టవద్దని, కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తింపు లభిస్తుందని అన్నారు. 2017కు ముందు నుండి పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీ లో కష్టపడ్డ వారికి బ్లాక్ అద్యక్షులు, మండల, వార్డు,గ్రామ అధ్యక్షులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా, బ్లాక్, మండల, డివిజన్ వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.