కోరుట్ల, మహా:
ప్రాథమిక పాఠశాల యస్, ఆర్, యస్, పి, క్యాంప్ గడి, కల్లూరు రోడ్ కోరుట్ల యందు పాఠశాలలో సమ్మర్ క్యాంప్ గత పదిహేను రోజుల నుండి నిర్వహించి అట్టి కార్యక్రమం, ఈ రోజు తో ముగింపు సందర్భంగా విద్యార్థులు వారి వ్యక్తి గత అభిప్రాయాలు చెప్పడం జరిగింది.విద్యార్థులు మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ లో రోజు ఆటలు,పాటలు,డ్యాన్స్,సాంగ్స్,లైబ్రరీ బుక్స్ చదివించడం,కథలు చెప్పడం,గణితం కు సంబంధించిన చతుర్విద ప్రక్రియల పై అవగాహన కల్పించడం,ఆంగ్లం నేర్పించడం జరిగింది.ఎండలో తిరగకుండా నీడలో ఆడించడం,వడదెబ్బ తగలకుండా మంచిదని మరియు రోజువారీ వివిధ రకాలుగా టిఫిన్స్ ఇవ్వడం చాలా హర్షణీయం అని ప్రభుత్వానికి ధన్యవాదాలు అని విద్యార్థులు అభిప్రాయాలు చెప్పారు. పాఠశాల రీ ఓపినింగ్ వరకు నడిపిస్తే బాగుండు అని,ప్రతి సంవత్సరం సేసవి శిబిరాలు నడిపించాలని కోరారు. ఈ ఇట్టి కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, సి ఆర్ పి గంగాధర్,ఇన్స్ట్రక్టర్ సంతోషిణి,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.








