Mahaa Daily Exclusive

  హీరో బెల్లంకొండ శ్రీనివాస్​‌పై కేసులు..!

Share

మహా: విధుల్లో ఉన్న ట్రాఫిక్​ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్​ జర్నలిస్ట్​ కాలనీలో నివాసముంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల రాంగ్​ రూట్​‌లో వస్తుండగా జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. అయితే, బెల్లంకొండ శ్రీనివాస్ కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు కానిస్టేబుల్​ ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదయ్యాయి.