Mahaa Daily Exclusive

  పర్సనల్గా టార్గెట్.. వేధిస్తున్న హైడ్రా అధికారులు న్యాయబద్దంగా నాపై కోర్టులో కొట్లాడాలని సూచన..!

Share

అబ్దుల్లాపూర్మెట్,మహా: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్సనల్ గా టార్గెట్ చేసి.. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వివాదంలో ఉన్న కొహెడ 951, 952 భూ యజమాని సంరెడ్డి బాల్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ వచ్చి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 1న ఇదే భూమి విషయంలో ప్లాట్స్ ఓనర్స్, బాల్ రెడ్డికి మధ్య జరిగిన ఘర్షణలో మారణాయుధాలు ఉపయోగిస్తే సాధారణ దాడి కేసు ఎలా నమోదు చేస్తారు. హత్య యత్నం కేసు నమోదు చేయకుండా ఏమీ చేశారని రంగనాథ్ సీఐని ప్రశ్నిస్తూ ఫైర్ అయ్యాడు. దీంతో ఇదే విషయంలో భూ యజమాని బాల్ రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్సనల్ గా టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే తాను నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రాన్ని ఫిబ్రవరి లో హైడ్రా కూచివేసిందన్నారు. తాను న్యాయబద్ధంగా కోర్టు ద్వారా ముందుకు వెళ్తుంటే తనను అనేక ఇబ్బందులు పెట్టి వేధిస్తున్నారన్నారు. హైడ్రా అధికారులకు బాల్రెడ్డి ఒక్కడే కనిపిస్తున్నట్లుందని అన్నారు. సిటీలో చాలా సమస్యలున్నాయని వాటిపై ఫోకస్ పెడితే బాగుటుందన్నారు. తాను కొనుగోలు భూమిలో అప్పుడు కూడా ఎలాంటి వెంచర్ లేదని తెలిపారు. వెంచర్ ఉండి ఉంటే న్యాయబద్ధంగా తనపై కోర్టులో కొట్లాడాలని అన్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో తనను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నేను చట్టానికి లోబడి ముందుకు వెళ్తానని చెప్పారు.